జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 12 at 13.32.24

TRINETHRAM NEWS

గేదెను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Nov 12, 2024,

చింతలమానపల్లి : ఆర్టీసీ బస్సు గేదెను ఢీకొన్న ఘటన కొమురంభీం జిల్లా చింతలమానపల్లి మండలం రుద్రపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ నుంచి బెజ్జూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రుద్రాపూర్ గ్రామ సమీపంలో దుర్గం మారుతికి చెందిన గేదెను బలంగా ఢీకొట్టింది. దీంతో కాసేపు బస్సు డ్రైవరు, గేదె యజమాని మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దలు సముదాయించి గేదెకు నష్టపరిహారం ఇప్పించడంతో వివాదం ముగిసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page