WhatsApp Image 2024 11 12 at 13.33.10
పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు
Trinethram News : పెంచికల్పేట్ : Nov 12, 2024,
పెంచికల్పేట్ మండలం ఎలుకపెల్లి గ్రామంలో మంగళవారం పగలే వెన్నెలగా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. గ్రామ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్క బల్బు పోతే పెట్టడానికి మండల స్థాయి నాయకులు చెప్పినా పెట్టించుకోవడం లేదని, కనీసం విద్యుత్ దీపాలను కాపాడడంలో కూడా శ్రద్ధచూపడం లేదన్నారు. ఈ విషయాన్ని పై అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
