దేవరకొండ జూన్ 30 త్రినేత్రం న్యూస్. చందంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ పొందుతున్న కరంటోతు చందర్ నాయక్ లక్ష్మీ పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ….. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఒక భాగం అని అన్నారు. విధి నిర్వహణలో చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. చిన్న వయసు నుండి చదువుకొని ఉద్యోగం సంపాదించి 42 సంవత్సరాలు వయస్సు వరకు ఉద్యోగం చేసి అలసిపోయిన ఉద్యోగులకు విశ్రాంతి తీసుకునే సమయం ఇది అన్నారు. పదవి విరమణ పొందుతున్న చందర్ నాయక్ దంపతులు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యములతో సుఖశాంతులతో మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఉన్నత పాఠశాలలో సుదీర్ఘంగా పనిచేసిన చందర్ క్రమశిక్షణకు కట్టుబడి, సమయపాలన పాటించి, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేశారని ఈ సందర్భంగా అన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు ఎ. రేవంత్ రెడ్డి విద్యను అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు అని అన్నారు.
PRTU సంఘంలో ఉపాధ్యాయులకు చేదోడు వాదోడుగా పని చేసిన వ్యక్తి చందర్ నాయక్ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ దంపతులను శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, PACs చైర్మన్లు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,యువజన కాంగ్రెస్ నాయకులు,PRTU నాయకులు,NSUI నాయకులు, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


