జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఎం ఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ మే 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని 12,13, 14వ వార్డులలో 2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో రోడ్లు లేక దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తన దృష్టికి తేవడంతో కావాల్సిన నిధులు మంజూరు చేసి,పనులు ప్రారంభించుకున్నాం అని అన్నారు. అభివృద్ది పనులు సకాలంలో పూర్తీ చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

అనంతరం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎక్సైజ్ శాఖ వారు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయడం జరిగింది.

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. కల్లుగీత కార్మికుల భద్రత, ఆరోగ్యం, క్షేమం అన్నింటిని పరిగణలోకి తీసుకొని కాటమయ్య రక్షణ కవచాలనుపంపిణీ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ కౌన్సిలర్లు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు ,మాజీ ఎంపీటీసీలు,మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The goal of our

You cannot copy content of this page