జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 07 at 18.58.00

TRINETHRAM NEWS

The problems of goldsmiths will be brought to the attention of the government

స్వర్ణకారులపై అంతరాష్ట్ర పోలీసులు వేధింపులు ఆపాలి

గుర్తింపు గల వ్యక్తులతోనే పాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేయండి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

స్వర్ణకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి స్వర్ణకారుల సంఘం అసోసియేషన్ సభ్యులు స్థానిక తెదేపా కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా స్వర్ణకారుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు మాట్లాడుతూ,అంతరాష్ట్ర పోలీసుల వేధింపులు స్థానిక స్వర్ణకారులపై తీవ్రమయ్యాయని తక్షణమే అంతర్రాష్ట్ర పోలీసులపై ఆంక్షలతో కూడిన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అంతర్రాష్ట్ర పోలీసులు భారి నుండి మమ్ములను కాపాడాలని ఈసందర్భంగా స్వర్ణకారులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈసందర్భంగా పరిటాల శ్రీరామ్ స్వర్ణకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు స్థానికంగా ఉన్న గుర్తింపు గల వ్యక్తులతో మాత్రమే మీరు కొనుగోలు చేసే విధంగా అసోసియేషన్ లో నిర్ణయం తీసుకోవాలని స్వర్ణకారులకు శ్రీరామ్ సూచించారు అదేవిధంగా అంతర్రాష్ట్ర పోలీసుల వేధింపుల నుండి స్థానిక స్వర్ణకారులను కాపాడుకోవడానికి మంత్రి సత్యకుమార్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుందామని ఈసందర్భంగా పరిటాల శ్రీరామ్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The problems of goldsmiths will be brought to the attention of the government

You cannot copy content of this page