తేదీ : 16/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు ఊట్లపల్లి, అనంతరం, మల్లాయిగూడెం, వేదాంతపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , కోడూరి. శ్రీనివాస్ , ఎం ధర్మారావు, ముదిగొండ పుల్లారావు, కె. చెన్నారావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని తెలిపారు.
సంక్షేమ పథకాలు కూడా అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి కులం, మతం, పార్టీ, భాషా బేధం లేకుండా అందిస్తుందని అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. శాసనసభ్యులు జారే. ఆదినారాయణ ప్రజలకు సమయానుగుణంగా అందుబాటులో ఉంటున్నాడని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన గ్రామ వార్డు స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అధిక మెజార్టీతో ఈ పార్టీ గెలుస్తుందని అన్నారు. నిరుపేదలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


