MLA KP. Vivekanand : దేశ సమగ్రత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ చూపిన మార్గం చిరస్మరణీయం

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ – 2 లో శివాజీ వారియర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….దేశ సమగ్రత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ చూపిన మార్గం చిరస్మరణీయమని, నేటి యువత దేశ సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో శివాజీ వారియర్స్ సభ్యులు, కార్పొరేటర్ కూన పారిజాత గౌరీష్, పద్మా నగర్ ఫేజ్ – 2 కాలనీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, కాలనీ వాసులు, భాస్కర్ రాజు, మురళీ, నాయకులు కిషోర్ చారి, మధుకర్ రెడ్డి, కేజీ.గిరిధర్, పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, భగవాన్ రెడ్డి, శ్రీధర్, రమేష్, కళ్లెం శ్రీనివాస్, జయం చారి, జలిగం రాకేష్, దుర్గయ్య, రాము యాదవ్, ఎషబోయిన రాజు, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The path shown by Chhatrapati Shivaji for the preservation

You cannot copy content of this page

Scroll to Top