త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: భారత దేశంలో సంక్షేమ పధకాలకు అంకురార్పణ చేసిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పేర్కొన్నారు. మండపేట మండలం, మారేడుబాక గ్రామంలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యాక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికీ పర్యటించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో కూటమి ఏడాది పాలన పట్ల జనమోదం లభించిందని తెలిపారు. మున్ముందు మరిన్ని ప్రజలకు ఆమోదయోగ్యమైన సంక్షేమ పధకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


