వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య , క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గోని చెరువులో మూడు రకాలతో కూడిన పది లక్షల పై చీలుకు చేప పిల్లలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులతో కలిసి వదిలారు.
జిల్లాలో ఒక కోటి 29లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం జరిగిందని దీనికి కోటి 7 లక్షల రూపాయలను వెచ్చించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 5 లక్షల మత్స్య కారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా 123 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


