MLA TRR : ప్రొహిబిషన్ మరియుఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని తుంకుల్ గడ్డ లో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన ప్రొహిబిషన్ మరియుఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల భద్రత,చట్ట పరిరక్షణ అని తెలిపారు.నూతన ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభంతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం విక్రయం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని,ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA T Rammohan Reddy inaugurated the Prohibition and Excise Police Station

You cannot copy content of this page

Scroll to Top