తేదీ : 14/11/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, లో సనాతన దర్మం కోసం నూతన పాలకవర్గం అంతకరణ శుద్ధితో పనిచేయాలి అని రాష్ట్ర ఆర్. టి. సి. చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు అన్నారు. స్థానిక కొజ్జిలిపేట లొ వెంచేసివున్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కొనకళ్ళ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేవుడి సేవ చేయడం ఎంతో అదృష్టం అని అటువంటి అదృష్టం ఈ కమిటీ కి దక్కిందని తెలిపారు. ఛైర్మెన్ లంకిశెట్టి నీరజ మిగిలిన తొమ్మిది మంది ధర్మ కర్తలను కొల్లు ఫౌండేషన్ అధినేత నీలిమ సత్కరించి వాళ్లందరినీ అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలు కు అగ్రస్థానం ఇస్తుంది అనటానికి పది మంది ధర్మకర్తలు లో ఆరుగురు మహిళలు ఉండడం గర్వకారణం అన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుంది అనడానికి ఈ దేవాలయం చైర్మన్ లంకిశెట్టి నీరజ ఉదాహరణ అన్నారు. సీనియర్ న్యాయవాది లంకశెట్టి బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లొ కొనకళ్ళ బుల్లయ్య, లోగిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనిల్ ,.పల్లపాటి సుబ్రహ్మణ్యం పుప్పాల ప్రసాద్, మ రకాని పరబ్రహ్మం ,మున్సిపల్ కార్పరేటర్లు సమతా కీర్తి,అనిత సుధాకర్ అర్బన్ బ్యాంకు అధ్యక్షులు దిలీప్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్ కరెడ్ల సుశీల, జనసేన నాయకులు , గడ్డం రాజు, దేవాలయం ఇ. ఓ మాధవిలత పాల్గొన్నారు. పలువురు కూటమి కుటుంబ సభ్యులు, నాయకులు నూతన ధర్మ కర్తలను ఘనంగా సన్మానించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


