ఐ కృష్ణ గ్లాబుక్స్ ఐ ఎఫ్ టి యు వర్కింగ్ ప్రెసిడెంట్!
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ పాత లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకువచ్చి నేడు అమలులోకి వచ్చిన సందర్భంగా ఐ ఎఫ్ టు యు జాతీయ కమిటీ పిలుపుమేరకుసింగరేణి బొగ్గు బావులపై లేబర్ కోడ్ ఆర్డర్ కాపీలను తగులబెట్టి.నిరసన కార్యక్రమాలు చేయడం. జరిగింది.
జీడీకే 1inc లైన్,జీడీకే 2ఏ. ఇంక్లైన్లో, జీడీకే 11ఇంక్లైన్లో గ్లాబుక్స్ ఐఎఫ్టియు ,సీఐటీయూ,హమ్స్, నాయకత్వంలో కార్మికులు లేబర్ కోడ్స్. ప్రతులను దగ్ధం చేయటం జరిగింది ఈ సందర్భంగా- గ్లాబుక్స్ ఐఎఫ్టియు వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ కృష్ణ మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాల నుండి పాత లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమంలో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కార్మిక ఉద్యోగ సంఘాలు అనేక నిరసనలు భారత్ బందులు, టోకెన్ సమ్మెలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పునర్ సమీక్షించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కార్మికుల అభిష్టానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలను సంప్రదించకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యమాలు చేసినా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను నిన్నటి నుండి (21/11/25) అమలులోకి తెచ్చిందని. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చడానికి ఈ కోడ్స్ అమలులోకి తెచ్చిందని వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో గ్లాబిక్స్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, రామగుండం రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, కోశాధికారి గుండేటి మల్లేశం, ఆర్ జీ 1 డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, కార్యదర్శి చింతల శేఖర్, సీఐటీయూ, హెచ్ఎమ్ఎస్ నాయకులు శివరాం రెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, సంపత్, మరియు ఐఎఫ్టియు నాయకులు ఐ రాజయ్య, ఎం కొమురయ్య. తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


