గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు లక్పతి నాయక్
దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. నవంబర్ 26న మహబూబ్ నగర్‌లో గిరిజన విద్యార్థి సంఘం నిర్వహిస్తున్న చలో మహబూబ్ నగర్ నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరియు గిరిజన హక్కుల పరిరక్షణ, గిరిజన విద్యార్థుల విద్యా అవకాశాల విస్తరణ, మరియు విద్యా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమం చారిత్రాత్మకం అని వారు పేర్కొన్నారు. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన దీక్షలో అందరూ భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మరియు వివిధ లంబాడి సంఘ నాయకులు నాయకులు మాట్లాడుతూ “గిరిజన విద్యార్థుల భవిష్యత్తు, విద్యా విధానం, మరియు రాజ్యాంగ హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం అత్యంత కీలకం. అందరూ ఒకే గొంతుతో ఐక్యంగా 26వ తేదీన మహబూబ్ నగర్ కు వెళ్లి మద్దతు తెలపాలి,” అని కోరారు. అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం చేపట్టిన ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, గిరిజన సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో శ్రీను నాయక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


