Judge T Srinivasa Rao : చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి: జడ్జి టి శ్రీనివాసరావు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా అడిషనల్ డిస్టిక్, సెషన్స్ జడ్జి టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం గోదావరిఖనిలోని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసూన అధ్యక్షతన న్యాయ సేవాధి కారసంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ డిస్టిక్, సెషన్స్ జడ్జి టి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. నేటి సమాజంలో యువత చెడుమార్గాల బారిన పడుతున్నారని, వాటి పట్ల జాగ్రత్త వహించాలన్నారు.

ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం అత్యవసరం తప్ప అనవసర సమయాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని అందులో వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. విద్యార్థులు చదువుకుంటూనే జీవితంలో స్థిరపడే విధంగా లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. చట్టాలపై అవగాహన ఉంటే గ్రామాల్లో తెలియని వారికి మీరే అవగాహన కల్పించాలన్నారు. వరకట్న సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని ఎలాంటి సమస్యలు ఉన్న న్యాయ సేవ సంస్థ సంప్రదించాలన్నారు. యుక్త వయసులో చెడు మార్గాలు భయభ్రాంతులకు గురికాకుండా జీవితంలో స్థిరపడేందుకు లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ పానల్ లాయర్ జి భూమయ్య, న్యాయవాది జె అమరేశ్వర రావు, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌ అరుణకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Students should increase their awareness of laws

You cannot copy content of this page

Scroll to Top