దేవరకొండ డివిజన్ డిసెంబర్ 17 త్రినేత్రం న్యూస్. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నల్గొండ జిల్లా, దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ మండలం, తాటికో ల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.పోలింగ్ కోసం చేసిన ఏర్పాట్లు,బ్యారికేడింగ్,ఓటింగ్ కంపార్ట్మెంట్లు,హెల్ప్ డెస్క్,ఫస్ట్ ఎయిడ్,తదితర ఏర్పాట్లు పరిశీలించి అప్పటివరకు పోలైన ఓట్లు,పోలింగ్ శాతం వివరాలనుఅడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఎట్టి పరిస్థితులలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని ,ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ముందే సమాచారం ఇచ్చారా ? అని ఆర్ ఓ ను అడిగి తెలుసుకున్నారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో నిర్దేశించిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావాలని, సాయంత్రం 5 లేదా 6 గంటల లోపు అన్నిచోట్ల కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని డి పి ఓ ను ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో జాప్యం చేయవద్దని ఆర్ ఓ లకుతెలిపారు .సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి వుంచి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


