త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,05 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ సెల్ లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి అన్నవరం, శ్రీనివాస్, సూరిబాబు తదితరులు ఆధ్వర్యంలో డి.ఆర్.ఓ,కి వినతి పత్రం అందజేయడం జరిగింది. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనాలు 35 వేల రూపాయలు మంజూరు చేయాలని, కనీస వేతన బోర్డును తక్షణమే నియమించాలని ప్రసాద్ అన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలు అనుగుణంగా విద్య, వైద్యశాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో పెరుగుతున్న అవసరాలు, ఇంటి అద్దెలు తదితర అవసరాలకు అనుగుణంగా ఒక కుటుంబ గౌరవప్రదంగా జీవించాలంటే నెలకు కనీసం 35 వేల రూపాయలు అవసరమని ఏఐటియుసి జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్ధారించిందని, ఈ కనీస వేతనం అమలకు రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయని ఆయన అన్నారు.
కనీస వేతనం 35 వేల రూపాయల అమలు చేసేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని, వినిమయ ధరల సూచన మేరకు కరువు భత్యం ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనాలు బోర్డును తక్షణమే నియమించాలని, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలు తక్షణమే 1ప్రకటించాలని, కార్మిక శాఖ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాన్ని పటిష్టవంతంగావించి కనీస వేతన చట్టాలు అమలకు భరోసా కల్పించాలని, అనేక రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 12 మాసాలకు పైగా వేతనాలు చెల్లింపులు బకాయిలు పెట్టారని, వేతన బకాయిలన్నిటిని తక్షణమే చెల్లించాలని, కార్మికుల జీతాలకు ప్రతినెలా ఒకటో తేదీన చెల్లించాలని, కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో ఈ పోరాటలు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీనిలో సతీష్, శేఖర్, శ్రీనివాస్, నాని, కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


