కడప జిల్లా, ప్రొద్దుటూరు తేదీ:17:04:2025. కాకినాడ జిల్లా శంఖవరం దళిత పేటలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ డి.దేవదాసు మరియు అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.బి సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం ప్రొద్దుటూరులోని వసంతపేట ఆయన నివాసం వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన వంటివి పునరావృత్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి పోలీస్ అధికారులను నియమించి దోషులన ఎంతటి వాళ్లయినా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


