Trinethram News : బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగo చారి ఈరోజు హైదరాబాదులోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాటిపాముల వెంకట్రాములు ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు సమక్షంలో సిపిఐ లో చేరారు….
ఈ సందర్భంగా రాయబండి పాండురంగాచారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం ఆయన మాట్లాడుతూ….
ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు ఉవ్వెత్తున నడుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రాయబండి పాండురంగం చారి తిరిగి మాతృ సంస్థలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బీసీ హక్కుల సాధన సమితి కమిటీలు వేయాలని అనంతరం రాష్ట్రంలోని 117 నియోజకవర్గాల్లో బీసీ హక్కుల సాధన సమితి కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలని అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీల అమలుకై ఉద్యమాలు ఉధృతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ జేఏసీలు నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లొడంగి శ్రవణ్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అంజయ్య నాయక్ ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


