TRINETHRAM NEWS

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తుందని ,
డిండి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి brs కు ఓటు వేస్తే ఎకరాకు పదివేలు ఇస్తుందని, అదే కాంగ్రెస్కు ఓటేస్తే 15000 ఇస్తానని హామీ ఇచ్చి రైతులను దగా చేశారని అన్నారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

బి ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు అందజేశారని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి , అది అందరి రైతులకు మాఫీ కాలేదని ఒక ప్రకటనలో అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App