DCPC : వినియోగదారులపట్ల గౌరవంతో మెలగాలి

TRINETHRAM NEWS

డిసిపిసి సభ్యుడు గొట్టిముక్కల

గోకవరం : త్రినేత్రం న్యూస్ : పెట్రోల్ బ్యాంకుల్లో వినియోగదారుల పట్ల గౌరవంగా మెలగాలని, నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు సూచించారు. మంగళవారం గోకవరం మండలంలోని భారత్ పెట్రోల్ బంక్ సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదు మేరకు బంకును సందర్శించి సిబ్బందిని హెచ్చరించారు. వినియోగదారులకు గాలి, నీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, మరుగు దొడ్డి లాంటి సేవలు ఉచితంగా అందించాలని బంకు నిర్వాహకులకు సూచించారు. ఫిర్యాదులు ఉంటే లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లై, సంబంధిత సేల్స్ ఆఫీసర్ కు తెలియజేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సిబ్బంది ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేయరాదన్నారు. సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అనంతరావు తెలిపారు. బంకు సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Treat consumers with respect

You cannot copy content of this page

Scroll to Top