వేమగిరి గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్, రాష్ట్రమంతటా సమగ్ర సర్వే చేసి అర్హులైన రైతులందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం కడియం మండలం వేమగిరి గ్రామంలో పంచాయతీ వద్ద నిర్వహించిన మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో గోరంట్ల పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని, ఇప్పటివరకు భూ యజమాని యొక్క హక్కులని సరిగా నిర్ధారించకపోవడం హద్దులు నిర్ణయించడంలో చిన్న చిన్న తగాదాలు జరగడం వలన గ్రామాల్లో విభేదాలకు కారణం అవుతున్నాయని అన్నారు.
కొత్త సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఎవరి నిర్దేశిత భూమి వారికి అందే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అధునాతన యంత్రాలతో సర్వే చేస్తున్నారని, సర్వే పూర్తయిన వెంటనే ప్రతి రైతుకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఉన్న పట్టాదారు పుస్తకాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పుస్తకాలకు తేడా గమనించాలని, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పాస్ పుస్తకాలు జారీ చేయడంతో పాటు మన భూమిపై మనకి హక్కు లేకుండా ఒక చట్టాన్ని కూడా చేశారని జగన్మోహన్ రెడ్డికి ఫోటోల పిచ్చి, పేర్లు పిచ్చి, రంగులు పిచ్చి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దుచేసి మీ భూమిపై మీకు పూర్తి హక్కు కల్పించిందని, ఇప్పుడు జారీ చేసే పాస్ పుస్తకాలపై ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుందని మరియు రైతు యొక్క ఫోటోతో పాటు అతని యొక్క భూమి వివరాలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, సర్పంచ్ అన్నదేవుల చంటి, పితాని శివరామకృష్ణ, జంగా వినోద్, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, వాసంశెట్టి బాలాజీ, వాసంశెట్టి నాగబాబు, గుత్తుల హరి ప్రసాద్, సురపురెడ్డి జానకిరామయ్య, దంగేటి సత్తిబాబు, కాండ్రేగుల సత్తిబాబు, అప్పరి అన్నవరం, పులుపు రవి, సుంకర గోపాలకృష్ణ, దెంగేటి శ్రవణ్, ఈతకోట రాజ్ కుమార్, డిప్యూటీ తాసిల్దార్ వెంకట లక్ష్మి, ఎంపీడీవో రమేష్, పంచాయతీ రూప్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


