Deepam-2 Schemes : ఉజ్వల, దీపం -2 పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగు

TRINETHRAM NEWS

రావులపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఉజ్వల పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….

త్రినేత్రం న్యూస్, ఉజ్వల, దీపం 2 పథకాలతో మహిళల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం రావులపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఉజ్వల పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కొక్కరికీ రూ.5వేల విలువైన మొత్తం రూ.10.75లక్షల విలువైన 215 కనెక్షన్స్ మహిళలకు అందజేసారు.

దీపం పథకం కింద ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గంలో 15,108 సబ్సిడీ సిలిండర్లు కింద రూ.1.33 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దీపం పథకం, ఉజ్వల పథకం రాయితీల కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కొత్తపేట నియోజకవర్గంలో రూ.5.66 కోట్లను అందించడం జరిగిందన్నారు. సాధారణ సిలిండర్ కి సైతం రాష్ట్రం రూ.572లు సబ్సిడీ కేంద్రం రూ.310లు సబ్సిడీ కింద అందిస్తున్నాయన్నారు.

ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన రాహుల్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కృషిని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లను రూ.4వేలకు పెంచడం జరిగిందన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15వేలను తల్లికి వందనం కింద ఇస్తున్నామన్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14వేలు జమ చేశామన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటికే రూ.6కోట్లను అందజేశామన్నారు. డ్వాక్రా మహిళలు ఎవరైనా పారిశ్రామిక వేత్తలుగా మారాలనుకుంటే ఎమ్ ఎస్ ఎమ్ ఈ కింద సలహాల కోసం రావులపాలెం లో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కేతా శ్రీను, గుత్తుల రాంబాబు,జక్కంపూడి బాలాజీ, కొప్పిశెట్టి ప్రసాద్,సాధనల శ్రీను,పెచ్చేటి చిన్నారావు,చిన్నం శ్రీనివాసరెడ్డి,రాచకొండ సతీష్,చింత శ్రీరామరెడ్డి,కోట వెంకటేశ్వరావు,కోట రమణి దుర్గ, కొవ్వూరి అచ్చిరెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ujwala, Deepam-2 schemes bring light to women's lives

You cannot copy content of this page

Scroll to Top