త్రినేత్రం న్యూస్ :జనవరి 9: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం ..బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు సీ ఎస్ ఈ అండ్ ఎ .ఐ .డి .ఎస్, డిపార్ట్మెంట్ మరియు ఎన్ ఎస్ ఎస్ సంయుక్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలను కోలాహలంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ .పి .వి .ఎన్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో హిందూ సాంప్రదాయ మరియు తెలుగు రాష్ట్రాల సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటగా భోగిమంటలతో ప్రారంభించి భోగిమంట చుట్టూరు కోలాటాల కొలహలంతో సందడి చేశారు. అనంతరం పొంగళ్ళు, హరిదాసుల పాటలతో, ఎద్దుల బండ్ల ఉత్సాహంతో, గాలిపటాలతో అంబరానంటిన విధంగా కాలేజీ మొత్తం మారు మోగినది. ఆ తర్వాత రంగవల్లుల పోటీలతో కాలేజీ మొత్తం ఉత్సాహంతో ఉల్లాసంగా సాగిందని తెలిపారు.
రంగవల్లులలో గెలుపొందిన విద్యార్థినులకు ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం కన్సిలేషన్ బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ఈ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి కే. రమేష్, ఏవో ఆర్ వి రమణారెడ్డి, ఎన్.ఎస్.ఎస్, సమన్వయకర్త ఏ కిరణ్ కుమార్ అన్ని విభాగాలు అధిపతులు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


