CITU Congratulates : ఆశా వర్కర్ల పోరాటానికి ఫలితం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 13 : రాష్ట్ర ప్రభుత్వ జీఓ నెం.94 ద్వారా ఆశా వర్కర్లకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంపు, అలాగే ఏడాదికి రూ.5 వేల చొప్పున గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యూటీ మంజూరు చేయడాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్‌ (సిఐటియు) అల్లూరి జిల్లా కమిటీ హర్షంగా స్వాగతించింది.
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగిన రాజీ లేని దీర్ఘకాల పోరాటాల ఫలితంగా ఈ హక్కులు సాధ్యమయ్యాయని కమిటీ పేర్కొంది. పోరాట పటిమతో సాధించిన ఈ నిర్ణయం ఆశా వర్కర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని సిఐటియు జిల్లా కమిటీ అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి.సి.హెచ్. పడాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పోరాటంలో భాగస్వాములైన ఆశా వర్కర్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

struggle of ASHA workers is a success

You cannot copy content of this page

Scroll to Top