Public Holiday : ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా పాటించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.

కృషికి గుర్తింపుగా ప్రభుత్వం సెలవు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన శాశ్వత కృషికి గుర్తింపుగా ప్రభుత్వం సెలవు దినాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఈ క్రమంలో బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏప్రిల్ నెల 14న భారతదేశం అంతటా పారిశ్రామిక సంస్థలు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తూ నోటిఫికేసన్ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సమాజంలో సమానత్వం అనే కొత్త శకాన్ని స్థాపించిన రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బీమ్ రావు అంబేద్కర్, అంబేద్కర్ సెలవు దినం. బాబా సాహెబ్ నమ్మకమైన అనుచరుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను గౌరవించారు అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Centre has declared

You cannot copy content of this page

Scroll to Top