ఏఐటియుసి, టి ఎమ్మార్పీఎస్, అధ్యక్షులు బొట్ల బిక్షపతి మాదిగ, వేల్పుల సారంగపాణి
హనుమకొండ జిల్లా మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మే 20వ తేదీన జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశ ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఈ సమ్మెను జూలై 09 కి వాయిదా వేసిన సందర్భంగా మంగళవారం రోజున జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఐటియుసి, టిఎంఆర్పిఎస్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ ,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ లోని అంబేద్కర్ సెంటర్ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి టిఎంఆర్పిఎస్, ఏఐటియుసి,అధ్యక్షులు బోట్ల బిక్షపతి మాదిగ, వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అదేవిధంగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను 4 కోడ్ లు గా విభజించి బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు భారీ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలు మార్చడం వల్ల కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురే అవకాశం ఉందని దీనికి తోడు గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరలు పెరగడంతో కార్మికులకు వచ్చే వేతనం సరిపోక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని అదేవిధంగా విరిగిన నిత్యవసదొరలను తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో బొక్క ఏలియా, మున్నంగి రఘు,ఎండి ఎగ్బాల్, మేకల దేవేందర్ యాదవ్,బొచ్చు సదానందం, డెంగు దామోదర్, ఎస్కే షమీం, జీ రవి, వై మూర్తి రాజు, కొడకండ్ల లక్ష్మి, వి ఉపేంద్ర, మాదర్శి రజిత, ఏ విమల, మేకల శంకర్, అలవాల ప్రవీణ్, చెట్ల వేణు కుమార్, మున్సిపాల్టీ కార్మికులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


