జూలై 16, 2026
TRINETHRAM NEWS

ఐ కృష్ణ , గ్లాబిక్స్ ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో బొగ్గు గని కార్మిక సంఘం గ్లాబిక్స్ ఐఎఫ్టియు రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ లు మాట్లాడుతూ ..మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న బొగ్గు గని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.
దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ నిరంకుశ కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులంతా నిరసన పాటిస్తున్నారని సింగరేణిలో కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా బొగ్గు గనులపై కార్మికులు ధరించి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు.
నాలుగు లేబర్ కోడుల రద్దుకై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా నిలవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, నాయకులు జీ మల్లేష్, ఐ రాజేశం,ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, ఎడ్ల రవికుమార్, ఎన్ సి బాబు, పి మొండయ్య, సారయ్య, కిరణ్ , సదానందం,సాంబయ్య. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Protest with black badges

You cannot copy content of this page