జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 22/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం లో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం కామవరపుకోట మండలాలలో ఉన్న గ్రామాలు పుట్లభట్ల గూడెం, గొల్లగూడెం,, కామవరపుకోట, కొత్తూరు, రామన్నపాలెం, తూర్పు ఎడవల్లి, మండల పరిషత్, ఫౌండేషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కె. రాజు, చంద్రశేఖర్, యం. సరస్వతి దేవి, టి. బాలస్వామి, ఐ. స్వర్ణలత, మల్లిక, మంజుల, వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం ప్రధానోపాధ్యాయులు వి. భవాని ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యారో తెలిపారు.
ప్రతిరోజు ప్రభుత్వ సమయం పాలన ప్రకారం పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రతిరోజు విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన, అన్నము, కూరగాయలు, ఆకుకూరలు గుడ్లు మొదలైనవి శక్తినిచ్చే ఆహారం పదార్థాలను అందిస్తున్నామని అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద పైన తెలిపిన ఆహార పదార్థాలను , రోజువిడిసి రోజు రాగిజావ, వేరుశెనగ గింజలు బెల్లం తో తయారు చేసినటువంటి చిక్కీలు అందిస్తున్నామని, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర విద్యార్థులకు అందించామని, అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థులకు తల్లికి వందనం తమ తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని పేర్కొన్నారు. సమయపాలన ఆధారంగా విద్యార్థులను ఆటలు ఆడిస్తున్నామని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమని అనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

educate students

You cannot copy content of this page