జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, మోమిన్ పెట్ మండలం ఎన్కతల గ్రామంలో సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మ తల్లి గుడిని అభివృద్ధి పనుల పేరుతో తొలగించే ప్రయత్నంపై యావత్ హిందూ సమాజం భగ్గుమంది. ఈ తొలగింపు కార్యక్రమానికి నిరసనగా పెద్ద ఎత్తున భక్తులు కదిలి వచ్చి, మాదిగల గుట్టపై ఉన్న గుడి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గుడికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
బిజెపి నాయకుల మద్దతు*:
ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి జిల్లా బిజెపి నాయకులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. ఆయన అక్కడ ఉన్న హిందూ భక్తుల మనోభావాలను గౌరవించాలని, గుడికి న్యాయం జరిగే వరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని హెచ్చరించారు.
కొప్పుల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అక్కడి ఇండస్ట్రీ కాంట్రాక్టర్లతో తక్షణమే మాట్లాడి, గుడికి సంబంధించిన విషయంలో ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మాధవి, కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, మీడియా ఇంచార్జ్ మోహన్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ రాఘవేందర్, ఆఫీస్ సెక్రటరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుడిని కాపాడాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని భక్తులు ఈ సందర్భంగా నినదించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tension over the attempt to remove

You cannot copy content of this page