జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఎస్ఎస్సి 2025 లో స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభను చాటారు. మొత్తం 600 మార్కులకు గాను ఇద్దరు విద్యార్థులు వేమూరి హేమంత్ సాయి, భూక్య భవ్య రాథోడ్ అత్యధికంగా 565మార్కులు సాధించారు. హాజరైన 104 మంది విద్యార్థులు 100 శాతం పాస్ అయ్యారు. 8 మంది విద్యార్థులు 550 కు పైగా, 55 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు.

తెలుగులో నలుగురికి 98, హిందీలో ఇద్దరికీ 98,ఇంగ్లీష్ ముగ్గురికి 97, మాథ్స్ ఐదుగురికి 100, సైన్స్ నలుగురికి 98, సోషల్ ముగ్గురికి 97 చొప్పున అన్ని సబ్జెక్టులలో 100% ఉత్తీర్ణత సాధించారు. పై ఘన విజయానికి సహకరించిన విద్యార్థులకు,తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్, ప్రిన్సిపాల్ అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, ఇన్చార్జి రామ్మూర్తి ధన్యవాదాలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Teja students excel in

You cannot copy content of this page