Drinking Water : డిండి బస్టాండ్ లో తాగు నీరు లేక ప్రయాణికులకు ఇబ్బంది

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఎప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. డిండి బస్టాండ్ లో తాగు నీరు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు అని మండల ప్రజలు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్లు వాపోతున్నారు, ఎండాకాలం తీవ్రంగా ఎండలు కొట్టడం వల్ల తాగునీరు లేక, ప్రయాణికులు నీరు కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ సిబ్బందికి ఎన్నిసార్లు. మొరపెట్టుకున్న పెట్టుకున్న ప్రయాణికుల దాహార్తి తీర్చే నాధుడే కరువయ్యాడని ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఆర్టీసీకి సంవత్సరానికి లక్షలలో ఆదాయం వస్తున్న ప్రయాణికుల దాహార్తి తీర్చే వనరులను ఏర్పాటు చేయక పోవడం గమనార్హం. రోజుకు కొన్ని వందల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీకి ముఖ్య ఆదాయం ప్రయాణికులే అయినా వారి బాధలు గోసలను పట్టించుకోకుండా ఏమి ఎరగనట్లు ఉండడం అసలు ఆర్టీసీ వ్యవస్థ ఏం చేస్తుందని, అధికారులు ముద్దు నిద్రపోతున్నారా అని మండల ప్రజలు ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు?
బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారం చుట్టుపక్కల ఆవరణ లోపల డంపింగ్ యార్డ్ వలే తలపిస్తుంది ప్రయాణికులు అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ లో ఉన్న సమస్యలన్నీటిని పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
డిండి బస్టాండ్ ను ఆర్ టి సిఅచ్చంపేట డిపో అధికారులు పట్టించుకోవడం లేదని , ప్రభుత్వానికి డిండి బస్టాండ్ ఆదాయం కావాలి కానీ ప్రయాణికుల గోసలు , ఇబ్బందులు పట్టించుకోరా ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
డిండి బస్టాండ్ ను దేవరకొండ డిపో ఆర్టీసీ వారికి అప్పగించాలని వారైనా మా బాధలు గోసలు ఇబ్బందులు పట్టించుకుంటారు అని డిండి మండల మరియు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు సిబ్బంది స్పందించి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని మంచినీటి సౌకర్యం కల్పిస్తారని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Passengers face hardship

You cannot copy content of this page

Scroll to Top