త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ శివ రెడ్డి పేట లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన.. వికారాబాద్ పట్టణంలో మానవత్వాన్ని మరచిన టీచర్ దాష్టికం వెలుగుచూసింది. చిన్నపిల్లలు అని చూడకుండా విద్యార్థులను రాడుతో కొట్టడంతో భయానికి గురైన ఇద్దరు విద్యార్థులు పాఠశాల నుండి పారిపోయిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే—వికారాబాద్ శివారెడ్డిపేట్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం రాత్రి డార్మెటరీలో ఆడుకుంటుండగా, పీఈటీ అన్వర్ ఖాన్ వారిపై రాడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో జీవన్ అనే విద్యార్థితో పాటు మరో విద్యార్థి గురువారం ఉదయం భయంతో పాఠశాల నుంచి పారిపోయారు.
విద్యార్థులు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద తిరుగుతుండగా పాఠశాల నర్స్ జమున గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు తీసుకువచ్చింది. ఈలోపు విద్యార్థులు లేరని ఉపాధ్యాయులు గమనించకపోవడం ఆశ్చర్యకరం.
తరువాత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కొట్టిన విషయాన్ని పక్కనబెట్టి “మళ్లీ పారిపోతే పాఠశాల బాధ్యత కాదు” అని లేఖ రాయించుకోవడం పాఠశాల యాజమాన్యం వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తింది.
తల్లిదండ్రులు ప్రశ్నించగా వైస్ ప్రిన్సిపల్ రాజేందర్, నర్స్ జమున సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, సెక్యూరిటీ గార్డ్ జహంగీర్ తల్లిదండ్రులతో అశ్రద్ధగా మాట్లాడినట్లు సమాచారం. ప్రిన్సిపల్ ప్రకాష్ “సోమవారం మాట్లాడుదాం” అంటూ ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
విద్యార్థి సంఘ నాయకులు, తల్లిదండ్రులు పీఈటీ అన్వర్ ఖాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అలసత్వం ప్రదర్శించిన వార్డెన్ ఖదీర్, సెక్యూరిటీ గార్డ్ జహంగీర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


