డిండి(గుండ్లపల్లి) అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా డిండి పోలీస్ ఆద్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో ఎస్ ఐ సి హెచ్ బాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జండా ఊపి 2కె రన్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక ఎస్ ఐ బాలకృష్ణా మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్ ఐ బాలకృష్ణ పేర్కొన్నారు.యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువతి యువకులు , యువజన నాయకులు విద్యార్థులు,మీడియా ప్రతినిధులు , పోలీస్ సిబ్బంది , తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


