ఆంధ్రా రైతాంగానికి తీరని అన్యాయం…
బిజెపి పాలిత రాష్ట్రాల్లో జాతీయ విపత్తా?
ఇక్కడ నష్టం కేంద్రానికి కనిపించదా…
కామన ప్రభాకరరావు ఆగ్రహం…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 31. మండపేట , తుఫాన్ బీభత్సానికి సర్వం కోల్పోయిన ఆంధ్రా రైతాంగానికి తీవ్ర అన్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏదైనా నష్టం వస్తె జాతీయ విపత్తుగా ప్రకటించే బీజేపీకి రాష్ట్రంలో జరిగిన భారీ నష్టం కంటికి కనబడటం లేదా అంటూ ద్వజమెత్తారు. మండపేట మండలం ఏడిద గ్రామం లో గురువారం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు మంథా తుఫాన్ వల్ల పొలాల లో రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ ఈ తూఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అవేదన వ్యక్తం చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం రైతు కు ఉచిత భీమాను చెల్లించక పోవడం వల్ల రైతు తీవ్రంగా నష్ట పోయారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామిక వేత్త లకు ఇస్తున్న రాయతీలలో రైతులకు 1% ఇస్తే రైతు బతుకుతాడని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని మోడీ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారనీ ద్వజమెత్తారు.మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారనీ విమర్శించారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.మొంథా తుఫాన్ రైతన్నకు అపార నష్టాన్ని,తీరని శోకాన్ని మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగాయనీ వెల్లడించారు.
ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయన్నారు. 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహావిపత్తు గా అభివర్ణించారు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టమన్నారు. మొంథా తుఫాన్ ను జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించాలనీ డిమాండ్ చేశారు. ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలన్నారు.అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ఎన్ డి ఏ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు రాష్ట్రానికిది ఆపద కాలమని చెప్పాలన్నారు.రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 2.88 లక్షలఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ అంచనా వేయడం భావ్యం కాదనీ దుయ్యబట్టారు. ఇది రైతులను కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసమనీ పేర్కొన్నారు.
వెన్నుముక లాంటి రైతన్నకు అండగా నిలబడే సమయం అన్నారు. పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమే జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే వుందన్నారు.మోడీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు ఇప్పుడైనా నోరు విప్పలని డిమాండ్ చేశారు.జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయాలని, సూచించారు.జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురావాలని చంద్ర బాబు కు సవాల్ చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవలాని కోరారు.రైతు దగ్గర మిగిలిన ధాన్యం ను ఏ షరతులు లేకుండా మద్దత్తు ధరతో కొనుగోలు చేయలన్నారు. రంగు మరీనా, తేమ శాతం ఎక్కువగా ఉన్న సరే అన్ని రైతు సేవాకేంద్రంలలో కొనుగోలు చేసే విదంగా ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పక్షన్న డిమాండ్ చేస్తున్నట్టు కామన తెలిపారు. ఈ కార్యక్రమం లో రైతులు పర్వతిన వీర వెంకట సత్యనారాయణ, మగ్గం రాజబాబు, గండ్రోతుల రామచంద్రరావు, పసుపులేటి పెద్దకాపు, బత్తుల సూర్యనారాయణ, వైట్ల చిన్నబ్బు, గోరింక నక్షత్రం, గంధం రమేష్, గొల్ల సత్యనారాయణ తదితరులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


