తాను విసిరిన వలలో చివరకు తానే చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే, సత్తి సూర్యనారాయణరెడ్డి
Trinethram News : పెదపూడి : త్రినేత్రం న్యూస్ : తన రాజకీయ అవసరాల కోసం దోమాడలో ఇళ్ళు కోల్పోయిన భాధితులను రెచ్చగొట్టి దారీతెన్నూ లేకుండా చేసిన మాజీ ఎమ్మెల్యే, 14 రోజులుగా పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం దగ్గరకు భాధితులు వెళ్ళకుండా, ఎమ్మెల్యే ని కలవకుండా అడ్డుగోడలా నిలిచి భాధితులను అగమ్యగోచరంలోకి నెట్టిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, సత్తి సూర్యనారాయణరెడ్డి కుయుక్తిని గ్రహించిన దోమాడ భాధితులు, ఉద్యమసంఘాలు, నేడు పెదపూడి మండలం విచ్చేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్జి గారిని కలసి తమ గోడు వెళ్ళబోసుకున్న భాధితులు. జరిగిన తప్పిదం వివరించిన ఉద్యమ నాయకులు. చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన భాధితులు.
తమ సమస్యని పరిష్కరించమని ఎమ్మెల్యే నల్లమిల్లిని కోరిన దోమాడ భాధితులు, ప్రభుత్వం ఎప్పుడూ భాధితుల క్షేమమే ఆలోచిస్తుందని కానీ ఇక్కడ భాధితులు వైయస్సార్ సిపి కుట్రలో చిక్కుకుని తప్పుదోవ పట్టడం వలననే ఈ జాప్యం జరిగిందని హితవు పలికిన నల్లమిల్లి.
దోమాడ వెళ్ళి టెంట్ లో నిరసన తెలుపుతున్న మిగతా భాధితులను కలసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, జగన్ ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్ధలానికి బదులుగా భాధితులకు మూడేసి సెంట్లు స్ధలం ఇచ్చి పట్టాలు మంజూరు చేస్తామని భాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి.
ఇళ్ళు నిర్మించుకునేందుకు రూ 3 లక్షల వరకూ హౌసింగ్ లోన్ మంజూరు చేయడమే కాకుండా భాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నల్లమిల్లి. అంతే కాకుండా లేఔట్ యాజమాన్యంతో అధికారులు చర్చించి భాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, ఆనాడే ప్రభత్వం దగ్గరకు వచ్చి ఉంటే ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని సమస్య అపుడే పరిష్కారం అయ్యేదని వైయస్సార్ సిపి నాయకులు పన్నిన కుట్రలో మీరు పడటం భాధాకరం అని చెప్పిన ఎమ్మెల్యే, నల్లమిల్లి.
తమని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, తప్పుదోవ పట్టించడం వల్లే తాము 14 రోజులు నానా ఇబ్బందులు పడుతూ ఉద్యమం చేయవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన భాధితులు. సమస్యని పరిష్కరించిన ఎమ్మెల్యే,నల్లమిల్లికి కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యమ నాయకులు.
14 రోజులుగా భాధితులను మాయచేసి హైడ్రామా నడిపించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గుట్టు బయట పడటంతో ఛీ కొడుతున్న నియోజకవర్గ ప్రజలు. ప్రజల కోసం పోరాటాలు చేయవలసిన మాజీ ఎమ్మెల్యే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బరితెగించడం అన్యాయం అంటున్న ప్రజలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


