తేదీ : 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం, రెడ్డి గణపవరం గ్రామం లో ఉన్నటువంటి సీనియర్ టిడిపి నాయకులు మాట్లాడుతూ మండలంలో టిడిపి కనుమరుగై పోతుందని అన్నారు. గత నలభై సంవత్సరాల నుండి టిడిపి జెండా మోస్తూ ప్రతినిత్యం ప్రజా సమస్యలకు పరిష్కారం చేస్తూ కష్టపడి పార్టీలో పని చేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు అనేది లేదని, వాపోయారు.
వైసిపి పార్టీ నుండి ఆ పార్టీ ఓడిపోవడం వల్ల కొందరు టిడిపిలో చేరితే వాళ్లు కష్టపడి పని చేయకపోయినా వాళ్లను గుర్తిస్తున్నారని చెప్పారు. మండలంలో ఉన్నటువంటి టిడిపి ఇంచార్జ్, అదేవిధంగా నియోజకవర్గం మరియు మండల కమిటీని మారిస్తే గాని మళ్లీ పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలకు పరిష్కారం చేస్తూ, ఒకవైపు అభివృద్ధి మరోవైపు పథకాలు ఒక కుటుంబానికి అందుతున్నాయని పేర్కొన్నారు. అధిష్టానం సర్వే చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలపటం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


