తేదీ: 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పౌరసరపర శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు పోలవరం నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈనెల ఇరవై రెండు, ఇరవై మూడు తేదీలలో నియోజకవర్గం పర్యటన సందర్భంగా ముంపు ప్రాంత ప్రజలకు మరియు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఆయన భరోసా ఇచ్చారు. నిరుపేద ప్రజలకు కూటమి ప్రభుత్వం నుండి వచ్చే అటువంటి పథకాలు, అభివృద్ధి గురించి చర్చించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. రెండువేల ఇరవై ఏడు వ సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ, ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. మండలాలు , బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కొన్ని గ్రామాలలో సభలు నిర్వహించి వారి యొక్క స్థితి గతులను తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, రాకుండా నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు చూసుకున్నారు. మంచినీరు వసతి, భోజన సదుపాయం కల్పించారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు క్యాంపు కార్యాలయంలో సభా ప్రాంగణంలో నియోజవర్గంలోని కొంతమంది వైసిపి నాయకులు మరియు, కార్యకర్తలు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే, ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శులు కరాటం.
సాయి గడ్డం .మనుగు .రవికుమార్ ఏడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు , ఉమ్మడి కూటమి అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంత్రి నాదెండ్ల రాకతో పోలవరం నియోజకవర్గం లోని ప్రజలందరూ జై జనసేన, జై జై జనసేన, జై టిడిపి, జై జై టిడిపి, జై బిజెపి, జై జై బిజెపి జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై మోదీ, జై జై మోదీ అంటూ నినాదాలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


