తిరువూరులో ‘‘రా కదలిరా’’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024: అమరావతి :

తిరువూరులో ‘‘రా కదలిరా’’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష…

తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది…

తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడింది…

జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది…

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెల బోయింది…

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా.. కదలిరా అని పిలుపునిస్తున్నా…

అసమర్థుడు ఉంటే రాష్ట్రం కొంతవరకు నష్టపోతుంది…

దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింది…

ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపాం…

అరాచకపాలనకు చరమగీతం పాడాలి…

వ్యవసాయశాఖను మూసేశారు.. ధాన్యం రైతు దగాపడ్డారు…

అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారు…

కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది…

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు…

పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరందేది…

ప్రాజెక్టులు కాదు.. కాలువల్లో పూడిక కూడా తీయట్లేదు…

డబ్బులు చెల్లించనందున కాంట్రాక్టర్లు పనులు చేయలేని పరిస్థితి…

కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితి…

కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…

రైతుల బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి…

సైతాన్ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి…

మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది…

ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు…

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు…

రుషికొండను బోడిగుండు చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు…

ఏపీ రాజధాని అమరావతిగానే ఉంటుంది…

రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది…

ఐదు కోట్ల ప్రజల రాజధాని మన అమరావతి…

టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తే.. జగన్ గంజాయి తెచ్చారు…

యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలను కుంటున్నారు…

సైకిల్ ఎక్కి ప్రజలను చైతన్యవంతలను చేయాలి…

మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా…

రాష్ట్ర యువతను ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుస్తా…

జాతికి పెద్ద ఆస్తి యువత కన్నెర్ర చేస్తే ఎవరూ బాగుపడరు…

దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తానని అనుకుంటున్నారు…

వైసీపీ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలి…

ఐదేళ్లలో ప్రజల జీవితాలు ఏమీ బాగుపడలేదు…

సంక్షేమ పథకాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ…

జగన్ పాలనలో వంద సంక్షేమ పథకాలు రద్దు చేశారు…

ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు భావిస్తున్నారు…

బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ పేరిట సూపర్ సిక్స్ అందిస్తాం…

ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం…

నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తాం…

అన్నదాత కింద రైతులకు రూ.20 వేలు అందిస్తాం…

జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకువస్తాం…

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం…

టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో…

జగన్ ఎమ్మెల్యేలను నమ్మట్లేదు.. ప్రజలు జగన్ ను నమ్మట్లేదు…

ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవు…

గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో అంబటి రాయుడును మోసగించారు…

టికెట్ మరొకరికి ఇవ్వడంతో అంబటి రాయుడు వెనుదిరిగారు…

ప్రజలకు సేవ చేసిన వారికి వైసీపీ సీట్లు ఇవ్వట్లేదు…

చంద్రబాబు, లోకేశ్, పవన్ ను దూషిస్తేనే టికెట్లు ఇస్తున్నారు…

కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజా చైతన్యం తేవాలి…

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ సిద్ధం కావాలి…

వైసీపీకి ఓటు వేస్తే జాతికి ద్రోహం చేసినట్లవుతుంది : టీడీపీ అధినేత చంద్రబాబు

You cannot copy content of this page

Scroll to Top