జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Swearing Ceremony

Swearing Ceremony : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 30 ; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామంలో వెలసియున్న మద్ది ఆంజనేయస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మరియు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు .ధర్మకర్తల మండలి చైర్మన్‌తో పాటు నూతన కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, మద్ది ఆంజనేయస్వామి ఆశీస్సులతో అందరూ ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దేవస్థాన అధికారులు, భక్తులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page