జూన్ 26, 2026
TRINETHRAM NEWS
MLA Provided Explanations

MLA Provided Explanations : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే30; తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రకటించిన పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక నిర్ణయానికి తిరువూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు పెద్దపీట వేస్తూ వస్తోందని అన్నారు. ఆ పార్టీ స్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి దేశ రాజకీయ చరిత్రలో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు._

ఇప్పుడు అదే స్ఫూర్తితో నారా లోకేష్ పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత లభించడంతో పాటు నాయకత్వ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళల భాగస్వామ్యం పెరిగి, రాజకీయాల్లో వారి పాత్ర మరింత బలోపేతం అవుతుందని వివరించారు.

మహిళా నాయకురాలు భూమా స్వాతి , నవ్య, మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించగా, చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక సాధికారత కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశారని, ఇప్పుడు నారా లోకేష్ ఈ శాతాన్ని రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా మహిళలకు రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో నూతన ఉత్సాహం నెలకొందని తెలిపారు.

అనంతరం గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళా సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత, అభిమానులు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page