Murder Case : హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

TRINETHRAM NEWS

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

డిండి (గుండ్లపల్లి) మార్చి 13 త్రినేత్రం న్యూస్. తిండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన మోకురాల నిరంజన్ తన భార్య రాములమ్మలకు సంతానం లేనందున వీరిని హతమార్చితే వీరి ఆస్తి తమకు దక్కుతుందని దురుద్దేశంతో మోకురాల నిరంజన్ అన్న కొడుకు మోకురాల శేఖర్ తండ్రి బుచ్చయ్య మరో ఇద్దరితో కలిసి తేదీ 05-05-2019 రోజున తన వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా వారి పై కత్తులతో దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశా రని మొకురాల నిరంజన్ బావమరిది చింతపల్లి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి ఛార్జ్ షీట్ కోర్టులో సమర్పించగా బుధవారం ప్రిన్సిపల్ జిల్లా , సే షన్స్ జడ్జి, నల్గొండ కోర్టు నిందితుడు ఏ 1 మోకూరల శేఖర్ తండ్రి బుచ్చయ్య కు జీవిత ఖైదు మరియు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.
మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా తీర్పు వెలువదించడం జరిగిందని తెలిపారు. ఈకేసులో సరైన ఆధారాలను సేకరించి కోర్టులో చార్జి షీట్ దాఖలు సమర్పించి నిందుతునికిశిక్ష పడేవిధంగా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు డి ,చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ,ప్రస్తుత సర్కిల్ ఎస్ సురేష్, డిండి సర్కిల్ డి,రాజు, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ , డిండి , సి డి ఏ కె,కృష్ణ, లైజన్ అధికారులు , పి,నరేందర్, ఎన్, మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

accused in the murder case

You cannot copy content of this page

Scroll to Top