MLA Gorantla : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి

TRINETHRAM NEWS

దుళ్ల గ్రామంలో హై స్కూల్ నందు వాలీబాల్, బ్యాట్మెంటన్ కోర్టులను ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల,

త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 9. కడియం మండలం,దుళ్ల గ్రామంలో, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతతను పొందవచ్చని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పాఠశాల క్రీడా స్థలాన్ని శుభ్రపరిచి విద్యార్థులకు ఆటలు ఆడుకునే విధంగా రూపుదిద్దాలని ఎమ్మెల్యే గోరంట్ల తన స్వీయనిధులు లక్ష రూపాయలు కేటాయించిన విషయం తెలిసినదే. ఈరోజు స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల క్రీడా మైదానాన్ని శుభ్రం చేసి, విద్యార్థులు ఆడుకునే విధంగా ఏర్పాటుచేసిన, వాలీబాల్, బ్యాట్మెంటన్ కోర్టులను ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు తమ లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని అన్నారు.

ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని, తల్లితండ్రులు పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు ఆటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎం.పీ.పీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏ.పీ.ఐ.ఐ.సీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, గుర్రపు సత్యనారాయణ, ముమ్మిడి దేవీ నాగేశ్వరరావు, చిట్టూరి అమ్మిరాజు, ముద్రగడ జెమ్మి, సూరపురెడ్డి భరత్, స్కూల్ కమిటీ సభ్యులు చింత శ్రీను, గోపి ప్రసాద్, యన్నమణి లక్ష్మీపతి, చిట్టూరి వెంకన్న చౌదరి, కాయలు సత్యనారాయణ, కంటిపూడి శ్రీను, కొలపాకుల సత్తిబాబు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Students should excel in sports

You cannot copy content of this page

Scroll to Top