కొమరిపాలెం అగ్ని ప్రమాదం – బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు డిమాండ్ – అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం!
గాయపడిన వారందరి, ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 9 : బిక్కవోలు మండలం కొమరిపాలెం శివారు, రాయవరం గ్రామానికి సెంటర్ లో ఉన్నటువంటి గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఇప్పటివరకు 8 మంది మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం పలువురు తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారూ,
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం , డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తీవ్ర ఆగ్రహ, మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్,
నిన్న అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం కొమరిపాలెం శివారు, రాయవరం సెంటర్లో గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సమాచారం. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు ప్రధాన కారణమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు ఎప్పటికి అప్పుడు తనిఖీలు చెయ్యకపోవటం, భద్రతా చర్యలు అమలు చెయ్యకపోవడమే ఈ దుర్ఘటనకు ముఖ్య కారణం.
అదేవిధంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న గాయపడిన వారందరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి అని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


