దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. 69వ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ జి ఎఫ్ ఐ కరాటే పోటీలకు దేవరకొండ మండలానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు జె కె ఏ ఐ షాటకాన్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ తెలిపారు. అండర్-17 బాలుర,బాలికల 58 కేజీ విభాగం నుండి గుండాల శివరామకృష్ణ, 52 కేజీ విభాగంలో కొండపల్లి అక్షయ , అండర్-14 బాలుర బాలికల 46 కేజీ విభాగంలో నుండి అభిష తెబాయ్ ,45 కేజీ విభాగంలో ఆర్ సాయి ప్రశాంత్ ,38 కేజీ విభాగంలో శ్రీరాముల అనంతలక్ష్మి దేవరకొండ జె కే ఏ ఐ కరాటే అసోసియేషన్ నుండి గెలుపొందారు, వారికీ దేవరకొండ ఎస్ ఐ చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్ అందజేశారు.
ఆర్ కె సేవా ఫౌండేషన్ అధ్యక్షులు పున్న రామకృష్ణ వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పొట్ట విజయ్ కుమార్, అలంపల్లి రాము, డాన్స్ మాస్టర్ జగన్, గుండాల వెంకట్ యాదవ్ మరియు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


