
రూ.10 వేల విరాళం అందించిన గోల్డ్ మెడల్ కార్యదర్శి సముద్రాల ధనంజయ్
Financial Support : దేవరకొండడివిజన్ నవంబర్ 04, త్రినేత్రం న్యూస్. మానవత్వం, సేవాభావం, విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో గోల్డ్ మెడల్ కార్యదర్శి శ్రీ సముద్రాల ధనంజయ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
తన తల్లిదండ్రులైన స్వర్గీయ శ్రీమతి సముద్రాల మణెమ్మ, స్వర్గీయ సముద్రాల మారయ్య ల జ్ఞాపకార్థం, కళాశాలలో తల్లిదండ్రులు లేని బి.ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని షాహిదా భవిష్యత్తు విద్యాభ్యాసానికి చేయూతనందించాలనే సదుద్దేశంతో రూ.10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కళాశాల మహిళా సాధికారిక విభాగం ఆధ్వర్యంలో విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా సముద్రాల ధనంజయ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ విద్యపై ఆశయంతో ముందుకు సాగుతున్న షాహిదాకు తన వంతు సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి కొంతైనా తోడ్పడుతుందని, ఆమె ఉన్నత విద్యను కొనసాగించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామావత్ రవి, వైస్ ప్రిన్సిపల్ జి. కోటయ్య, మహిళా సాధికారిత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రేణుక, అకాడమీ కోఆర్డినేటర్ సిహెచ్. లింగమయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కె. పృథు, డాక్టర్ వి.మకట్లాల్ డాక్టర్ ఎం .ప్రభాకర్, ఎస్.సురేష్, అమర్,మధు,జగతి ,భరణి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe