Children’s Day : ఆర్ కే సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో నేడు మాజీ దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్బంగా ఆర్ కే సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కరాటే చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్ కే సేవా ఫౌండేషన్ అధ్యక్షులు పున్న రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపి వారి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎక్సైజ్ ఎస్ ఐ నర్సింహా మరియు సీనియర్ జర్నలిస్ట్ ముసిని అంజన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి నెహ్రు కు పిల్లల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత వలన ఆ మహనీయుని జయంతి సందర్బంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో అనందం అని, నేటి పిల్లలే రేపటి పౌరులు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కరాటే మాస్టర్ శ్రీను, ప్రధాన కార్యదర్శి పొట్ట విజయ్ కుమార్,అలంపల్లి రాము, డాన్స్ మాస్టర్ జగన్, గుండాల వెంకట్ యాదవ్, మరియు విద్యార్థుల తల్లితండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Children's Day celebrated under RK Seva Foundation

You cannot copy content of this page

Scroll to Top