డిండి (గుండ్ల పల్లి) జూన్10 త్రినేత్రం న్యూస్, డిండి మండల పరిధిలోని నగర దుబ్బ తండ గ్రామంలో సోమవారం 9న కరంథోతు సిద్దు సన్నాఫ్ చంద్రు వయస్సు 13 సంవత్సరాల విద్యార్థి తోటి స్నేహితులతో కలసి వారి గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి మిట్టన్ కుంట చెరువులో సాయంత్రం ఐదు గంటలకు స్నానానికి వెళ్లి ప్రమాదవశత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది.
ఈరోజు అనగా మంగళవారం జూన్ 10న మృతుని తండ్రి కరన్టోతు చంద్రు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించడం జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


