DPHNO Bhulokamma : శిశువు సంరక్షణలో మిడ్ వైఫ్ ల పాత్ర కీలకం

TRINETHRAM NEWS

డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ జూన్ 11: నవజాత శిశువుల సంరక్షణ మెడికల్ కేర్లో మీడ్ వైఫ్ ల పాత్ర కీలకమని అల్లూరి జిల్లా డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ అన్నారు.అల్లూరి జిల్లా కేంద్రంలోని పాడేరు మదర్ అండ్ చైల్డ్ సంరక్షణ విభాగంలో సొసైటీ ఆఫ్ మిడ్ వైఫ్ ఇండియా(సోమి)హిమాలయ బేబీ కేర్ సెంటర్ జిల్లా డిఎం&హెచ్ఓ ఆధ్వర్యంలో ఎసెన్సియల్ న్యూబర్న్ కేర్ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు.శిశువు ఆరోగ్యం సంరక్షణ తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృతి చేసి సర్టిఫికెట్లు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ మిడ్ వైఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శాంతి విక్టోరియా రాణి నేషనల్ కో.ఆర్డినేటర్ సంధ్యారాణి నేషనల్ మిడ్ వైఫ్ ఎడ్యుకేటర్ ప్రిన్కిల్లా డాక్టర్.శ్రీలేఖ గైనకాలజిస్ట్ పిహెచ్ఎన్ పెద్దమ్మి సూపర్వైజర్ ఏఎన్ఎంలు స్టాప్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The role of midwives

You cannot copy content of this page

Scroll to Top