Revenue Conferences : డిండిమండలంలో ముమ్మరంగా రెవిన్యూ సదస్సులు

TRINETHRAM NEWS

డిండి ( గుండ్ల పల్లి)జూన్10 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు జూన్ 3 నుండి 16 వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా డిండి మండలంలోని కె గౌరారం మరియు జి. టి వానిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించినట్లు తాహసిల్దార్ అంబటి ఆంజనేయులు తెలిపారు. మండలంలో రెండు బృందా లుగా రెవెన్యూ అధికారులుగ్రామాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని మొదటి టీంకు తాహసిల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో, రెండవ టీము డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సరోజ ఆధ్వర్యంలో సదస్సులు కొనసాగుతున్నాయని తాహసిల్దార్ తెలిపారు.

రైతులకు సంబంధించిన భూమి వివరములు, సర్వే నెంబర్లు తప్పుగా, పాసుబుక్కులలో పేరు తప్పుగా ప్రచురితమైన, భూమి ఎక్స్టెండ్ లో తేడాలున్నా, పట్టాదారు పాసుబుక్కులో కులము, గ్రామము, ఇంటిపేరు కుటుంబ సభ్యుల పేర్లు తప్పుగా ఉన్నట్లయితే, తదితర సమస్యలపై గ్రామసభలలోవిన్నవించుకోవాలని, అప్లికేషన్లు గ్రామ సభలో అందిస్తామని వాటికి ఆధార్ కార్డు జత చేసి అందించాలని,ఈ సదవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని, డిండి మండల తాహసిల్దార్ ఆంజనేయులు రైతులకు పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revenue conferences in full

You cannot copy content of this page

Scroll to Top