CPM : మెగా డీఎస్సీ లో ఆదివాసులకు అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్ర మూవీస్ ఆగస్టు 16: మెగా డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను స్థానిక ఆదివాసుల నుండి దూరం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనరస హెచ్చరించారు. అరకులోయ సిపిఎం కార్యాలయంలో ఎస్‌బిఐ పోతురాజు, కె. రామారావు, మగ్గన్న, జగన్నాథం తదితరులతో కలిసి మాట్లాడుతూ, ప్రభుత్వం నూరు శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయకపోవడంతో ఐదువేల పోస్టులు ఆదివాసులకు దక్కకుండా పోతున్నాయని విమర్శించారు.
ఐదో షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ నుండి మినహాయించాలని, గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసి గవర్నర్, రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో 21 ఒప్పందాలు కుదుర్చుకోవడం ఐదో షెడ్యూల్, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని ఆరోపించారు. అరకు ఆర్గానిక్ కాఫీని టాటా కంపెనీకి దోహదం చేయడం, ఏజెన్సీలో హోమ్ స్టేలు ఏర్పాటు చేయడం ద్వారా విష సంస్కృతి వెదజల్లే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

tribals in Mega DSC

You cannot copy content of this page

Scroll to Top